

కంటెంట్ బాగున్న చిన్న చిత్రాల సక్సెస్ ట్రెండ్‌ను కొనసాగిస్తూ కికు యనమల హీరోగా నటించిన యూనిక్ సర్వైవల్ థ్రిల్లర్ ‘చిరంజీవి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ.1.8 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. థియేటర్లలో ఇదే స్థాయిలో ఆదరణ కొనసాగితే తొలి వారంలో సినిమా మరింత మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని చిత్రబృందం భావిస్తోంది. వినూత్న కథాంశం, ఊహించని స్క్రీన్‌ప్లేతో పాటు యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
‘చిరంజీవి’ చిత్రాన్ని కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి నిర్మించగా, శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించారు. కశిష్ ఖాన్, ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, గిరీష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. రక్షాబంధన్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో మంచి విజయాన్ని అందుకుంటోందని మేకర్స్ పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!