
జనరల్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో అశ్విని కదం నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా ప్రశ్నాపత్రాలను పంపిణీ చేసినట్లు సీబీఐ గుర్తించినట్లు సమాచారం. ఒక్కో అభ్యర్థికి సుమారు ₹5 లక్షల వరకు వసూలు చేసి పేపర్‌ను విక్రయించినట్టు దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో నిందితుల ఫోన్ కాల్స్, ఆర్థిక లావాదేవీలపై కూడా సీబీఐ లోతుగా విచారణ చేపట్టింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9 మందిని అరెస్ట్ చేసిన అధికారులు, ఈ లీక్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పరీక్షల పారదర్శకతపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!