
సినిమాలు

దేశవ్యాప్తంగా పలు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవంగా భర్తీ కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు రాజ్యసభ స్థానాలు ఎన్డీయే కూటమి ఖాతాలో చేరాయి. రాష్ట్ర శాసనసభలో కూటమికి ఉన్న బలంతో అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ నాలుగు స్థానాల్లో మూడు స్థానాలను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) దక్కించుకోగా, ఒక స్థానాన్ని జనసేన పార్టీ సొంతం చేసుకుంది. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్‌లు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ విజయంతో పార్లమెంట్ ఎగువ సభలో ఎన్డీయే బలం మరింత పెరగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!