

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అహ్మదాబాద్‌లో టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతా, డైరెక్టర్ షాన్ మెహతా, హోల్‌టైమ్ డైరెక్టర్ జిగీష్ మెహతాలతో భేటీ అయ్యారు. విశాఖలోని టోరెంట్ ప్లాంట్ బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేషన్ ప్రణాళికల నేపథ్యంలో రాష్ట్రంలోని ఫార్మా క్లస్టర్లలో ఏపీఐ, అధునాతన ఇంటర్మీడియట్ తయారీ సామర్థ్యాలను విస్తరించే అవకాశాలను పరిశీలించాలని లోకేశ్ కోరారు.
పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు సరఫరా చేసేందుకు ఏపీలో సౌర, పవన, హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, ఇతర క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు కూడా ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకోవాలని కోరారు. టోరెంట్ పవర్ ప్రస్తుతం 3.96 గిగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టులు, 3 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోందని సమీర్ మెహతా తెలిపారు. 2030 నాటికి 10 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యాన్ని చేరుకోవడమే లక్ష్యమని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!