
సినిమాలు

మురసు తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పాటు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాల రాకపోకలు ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్లే నాలుగు విమాన సర్వీసులతో పాటు చెన్నైకి వెళ్లే ఒక విమాన సర్వీసును అధికారులు రద్దు చేశారు. సర్వీసుల రద్దు విషయాన్ని ప్రయాణికులకు ముందుగానే తెలియజేశారు.
తుఫాన్ ప్రభావంతో వరుసగా రెండో రోజు కూడా విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. అంతకుముందు రోజు కూడా ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు కొనసాగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమాన సర్వీసుల రద్దుతో పలువురు తమ ప్రయాణాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!