

భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకానున్నట్లు సమాచారం. న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశాలకు పుతిన్ వస్తారని దక్షిణాఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం ధ్రువీకరించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అలాగే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చైనా ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇంకా విడుదల చేయలేదు.
2019లో భారత్‌ను సందర్శించిన జిన్‌పింగ్, గాల్వాన్ లోయ ఘర్షణలు మరియు తవాంగ్ సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత భారత్ పర్యటన చేయలేదు. అనంతరం రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోదీ, జిన్‌పింగ్ సమావేశమయ్యారు. భౌగోళిక రాజకీయాలు, ఇరాన్ యుద్ధం వంటి అంశాలపై బ్రిక్స్ కూటమిలో భేదాభిప్రాయాలు ఉన్నాయన్న వార్తల మధ్య ఈ సమావేశాలకు రష్యా, చైనా అధినేతలు హాజరవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా ఉమ్మడి ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!