

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట్ పరిధిలోని కుంట్లూరు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాల ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్వహణ కొనసాగిస్తోందని ఆరోపణలు వెలువడ్డాయి. విద్యార్థులను ఆకర్షించే హామీలు ఇస్తూ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
ఆ కళాశాలలో విశాలమైన తరగతి గదులు, ల్యాబ్‌లు, క్రీడా మైదానం, అర్హత కలిగిన అధ్యాపకులు వంటి తప్పనిసరి సౌకర్యాలు లేవని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి సంఘాలు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని, నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలో పుస్తకాల విక్రయాలు కూడా జరుగుతున్నాయని విమర్శిస్తున్నాయి.
ప్రభుత్వ అనుమతులు లేకుండా కళాశాల నిర్వహణ కొనసాగితే వెంటనే సీజ్ చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!