
జనరల్

వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాలపై కొనసాగుతున్న బలమైన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మేఘావృత వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద లేదా భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడవద్దని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!