

సాంస్కృతిక, వారసత్వ సంపదైన హస్తకళలను పరిరక్షించడంతో పాటు కళాకారులకు ముడిసరుకు కొరతను తీర్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరం వద్ద అటవీ శాఖ ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన వుడ్ బ్యాంకులను వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ వుడ్ బ్యాంకుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 హస్తకళాకారుల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ వుడ్ బ్యాంకులో ప్రస్తుతం 30 క్యూబిక్ మీటర్ల కలప అందుబాటులో ఉంచారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, మాధవమాల, శెట్టిగుంట కళాకృతులు, బొబ్బిలి వీణల తయారీదారుల కోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వుడ్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కళాకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కలప, కళాకృతులపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి వాటి వివరాలను పరిశీలించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!