21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

Writer: Harika S 04:34 PM, 21 ఆగస్టు, 2026
రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

భూసేకరణ, పునరావాసం కోసం ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయి భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసిత కుటుంబాల ఖాతాల్లోకే చేరాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్ల పీడీ ఖాతాల్లో నిధులు జమ చేయడంతో ప్రభుత్వ బాధ్యత పూర్తయినట్లు కాదని, లబ్ధిదారులకు డబ్బులు చేరినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌లో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ అనుమతులు, చెల్లింపుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. అవసరమైన పత్రాలు, లబ్ధిదారుల వివరాలు పూర్తిగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి రెండు రోజుల్లోనే పరిహారం రైతులు, నిర్వాసితుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు.

భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ అవసరాల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2,782 కోట్లు విడుదల చేయగా, సుమారు రూ.566 కోట్లు లబ్ధిదారులకు చేరినట్లు సమీక్షలో వెల్లడైంది. మరో రూ.989 కోట్లు వివిధ దశల్లో చెల్లింపుల ప్రక్రియలో ఉండగా, రూ.199 కోట్లు జిల్లాల వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ పంపిణీ ప్రారంభం కావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

దాదాపు రూ.1,200 కోట్లను తక్షణమే లేదా స్వల్ప పరిపాలనా ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారులకు అందించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని అత్యవసరంగా రైతులు, నిర్వాసితుల ఖాతాల్లోకి జమ చేయాలని ఆదేశించారు. జగిత్యాల, సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని భూసేకరణ సమస్యలను కూడా ఆయన సమీక్షించారు. కన్సెంట్ అవార్డులు, పరిహారం ప్రక్రియను వేగవంతం చేసి ప్రాజెక్టుల పనులు ఆలస్యం కాకుండా చూడాలని సూచించారు.

అటవీ అనుమతుల విషయంలోనూ శాఖల మధ్య సమన్వయ లోపంతో పనులు నిలిచిపోకూడదని మంత్రి స్పష్టం చేశారు. కలెక్టర్లు రెవెన్యూ, నీటిపారుదల, అటవీ శాఖల అధికారులతో సంయుక్త సమావేశాలు నిర్వహించి పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులు పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
ట్యాగ్లు
ఉత్తమ్ కుమార్ రెడ్డితెలంగాణ నీటిపారుదలభూసేకరణరైతుల పరిహారంఆర్‌అండ్‌ఆర్‌తెలంగాణ ప్రాజెక్టులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు  ఓటేయండి: ప్రియాంక వినతి
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఓటేయండి: ప్రియాంక వినతి

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్
జనరల్

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
జనరల్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా
జనరల్

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

ఓటీటీలో ‘గాంధారి’
ఓటీటీ

ఓటీటీలో ‘గాంధారి’

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే
జనరల్

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
జనరల్

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!
సినిమాలు

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!