
జనరల్

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ కొండచరియలు విరిగిపడటంతో కులు జిల్లాలోని నిరమండ్ ప్రాంతంలో రహదారి తీవ్రంగా దెబ్బతింది. భాగిపుల్-జావో రహదారిపై కొండచరియలు పడటంతో సుమారు 200 మీటర్ల మేర రహదారి ధ్వంసమైంది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రహదారి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి మార్గాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావడానికి పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణికులు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!