
రాజకీయాలు

రాజధాని హైదరాబాద్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భారీగా ఓట్లు గల్లంతైనట్లు ముసాయిదా జాబితా వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో కలిపి సగటున 37.3 శాతం ఓట్లు రద్దయ్యాయి. జూన్ 10 నాటికి 1.14 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 71 లక్షలకు తగ్గింది. మరో 38.93 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
నేటి నుంచి సెప్టెంబరు 16 వరకు బీఎల్వోలు నోటీసులు అందించనున్నారు. అక్టోబరు 15 నుంచి ఓటర్లు సమర్పించే గుర్తింపు పత్రాలను పరిశీలించి, ఓటును కొనసాగించాలా లేదా రద్దు చేయాలా అన్నది నిర్ణయించనున్నారు. ఎల్బీనగర్లో ఓట్ల డిజిటలీకరణ 55.56 శాతమే పూర్తికాగా, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో 60 శాతానికిపైగా ఓటర్లు మ్యాపింగ్ కాలేదని అధికారులు వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!