
జనరల్

అహింసను ఆయుధంగా మలచుకుని స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీజీ మానవాళికి సత్యం, శాంతి, మానవత్వం వంటి విలువలను అందించిన మహనీయుడని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన మార్గం నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
సత్యం, అహింస, స్వావలంబన, గ్రామ స్వరాజ్యం, సామాజిక సమానత్వం గాంధీజీ ఆశయాలకు పునాదులని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజా పాలనకు ఈ ఆశయాలే కీలకమని చెప్పారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో శాంతి, సామాజిక న్యాయం, సమానత్వం, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని సీఎం అన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!