
ఓటీటీ

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా శాంతి ఒప్పందంపై కీలక పురోగతి చోటుచేసుకున్నట్లు సమాచారం. తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవడానికి టెహ్రాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.
అయితే తమ ఓడరేవులపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు విదేశాల్లో నిలిపివేసిన ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కోరినట్లు తెలుస్తోంది. శాంతి ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా దాదాపు సిద్ధమైందని, త్వరలో అధికారిక ప్రకటన చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!