
రాజకీయాలు

ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ పేరిట అక్రమంగా ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరిగితే తీవ్రంగా అడ్డుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌లో 31 లక్షల ఓట్లు చేర్చి, 93 లక్షల ఓట్లను తొలగించినట్లు ఆయన ఆరోపించారు. ఇటీవల ఆ రాష్ట్రంలో టీఎంసీ కేవలం 30 లక్షల ఓట్ల తేడాతోనే ఓడిందని పేర్కొంటూ, ఓటర్ల జాబితా మార్పులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణలో ధాన్యం దిగుబడి పెరగడంతో కొనుగోళ్లలో కొంత ఆలస్యం జరిగినట్లు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. తన పనితీరును ఏఐసీసీ లేదా ముఖ్యమంత్రి అంచనా వేస్తారని, పీసీసీ మార్పు విషయంలో తుది నిర్ణయం ఏఐసీసీదేనని స్పష్టం చేశారు. ఏఐసీసీ దృష్టిలో తెలంగాణ పీసీసీ అత్యుత్తమంగా ఉందని కేసీ వేణుగోపాల్ పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!