
రాజకీయాలు

మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ను ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో మధు యాష్కీ గౌడ్‌కు కీలక బాధ్యతలు అప్పగించినట్లు ఈ నియామకం ద్వారా స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా వృత్తి నిపుణులు, మేధావులతో పార్టీ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ బాధ్యత కీలకంగా ఉండనుంది.
మధు యాష్కీ గౌడ్ నియామకంపై తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యత దక్కడం పట్ల ఆయనకు అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!