

కాన్పూర్‌కు చెందిన భారతీయుడు విపుల్ మిశ్రాను శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ తాత్కాలిక సీఈఓగా నియమించింది. ఇప్పటికే ఆయన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ఇంజినీరింగ్ విభాగం చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విమాన ఇంజినీరింగ్, విమానయాన రంగంలో రెండు దశాబ్దాలకు పైగా నాయకత్వ అనుభవం ఉండటంతో ఆయనను తాత్కాలిక సీఈఓగా నియమించినట్లు సంస్థ వెల్లడించింది. కొత్త బాధ్యతల్లో ఆయన ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.
విపుల్ మిశ్రా నియామకం ప్రాంతీయ విమానయాన రంగంలో ఆసక్తికరంగా మారింది. భారతదేశానికి చెందిన ఎయిరిండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థలు గతంలో విదేశీయులను కీలక నాయకత్వ స్థానాల్లో నియమించిన సందర్భాలు ఉన్నాయి. అయితే శ్రీలంకకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ తన తాత్కాలిక సీఈఓగా భారతీయుడిని ఎంపిక చేయడం ప్రత్యేకంగా నిలిచింది. విమానయాన రంగంలో మిశ్రాకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, సుదీర్ఘ అనుభవం సంస్థకు ప్రస్తుత నాయకత్వ దశలో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!