
జనరల్

మాదాపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 16న మాదాపూర్‌లో సంజూష్ నడుపుతున్నట్లు చెబుతున్న కారు 26 ఏళ్ల యువతిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన యువతి ఘటనాస్థలంలోనే మృతిచెందింది. మృతురాలు ఇనార్బిట్ మాల్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల దర్యాప్తులో ప్రమాదానికి కారణమైన కారును సంజూష్ నడిపినట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆయనపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్)లోని 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమైన అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!