
సినిమాలు

ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, మంగళవారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సెప్టెంబర్ 23 నాటికి దక్షిణ ఒడిశా–ఉత్తర కోస్తాంధ్ర తీరానికి సమీపించే అవకాశం ఉంది.
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల్లో వర్షాలు పెరగనున్నాయి. సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, బుధ, గురువారాల్లో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!