
జనరల్

పోక్సో కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. “బేటీ బచావో, బేటీ పఢావో” అంటూ ప్రచారం చేసే కేంద్ర ప్రభుత్వ పరిస్థితి ఇప్పుడు కేంద్ర మంత్రి కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసే స్థాయికి చేరిందని వ్యాఖ్యానించారు. ఆ కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించకుండా విచారణ నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి లేదని ఆరోపించారు.
మైనర్ బాలికకు అన్యాయం జరిగిన కేసులో నిందితుడిని తొమ్మిది రోజుల పాటు దాచిపెట్టిందీ అదే కుటుంబమని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కలిసి ఈ వ్యవహారాన్ని “హనీ ట్రాప్”గా చూపిస్తూ మీడియాను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!