
జనరల్

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు నైపుణ్యమున్న మానవ వనరులు కావాలంటే మహిళలు ఎక్కువ మంది పిల్లలను కనడం మాత్రమే పరిష్కారమా? అని మాజీ ఐపీఎస్, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించలేమా? అని ఆమె వ్యాఖ్యానించారు.
ఎక్స్ వేదికగా ఆమె మాట్లాడుతూ మహిళలను జనాభా పెంపు సాధనాలుగా చూడకూడదని పేర్కొన్నారు. భాషాభివృద్ధి, నైపుణ్య కేంద్రాల ఏర్పాటు, దేశవ్యాప్తంగా ప్రతిభను ఆకర్షించడం ద్వారా ఉత్పాదకతను పెంచాలని సూచించారు. జనాభా పెంపు కోసం ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చని చెబుతూనే, మహిళల జీవితంలోని అత్యంత ఉత్పాదక కాలాన్ని కేవలం పిల్లల పెంపకానికే పరిమితం చేయడం సరైనదేనా? అని ప్రశ్నించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!