
జనరల్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో కీలక మార్పు చోటుచేసుకుంది. అమెరికా పర్యటనకు కేంద్రం నుంచి రాజకీయ అనుమతి లభించకపోవడంతో ఆ పర్యటన రద్దయింది. దీంతో లండన్‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లకుండా నేరుగా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ మేరకు ఆగస్టు 23న లండన్ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు సమాచారం.
‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తొలుత బ్రిటన్, అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ రాజకీయ క్లియరెన్స్ నిరాకరించడంతో షెడ్యూల్‌లో మార్పు జరిగింది. కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ అమెరికా పర్యటనను రద్దు చేసుకుని లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరిగి రావాలని సీఎం నిర్ణయించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!