
జనరల్

‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అంశంపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమాంతర ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే దేశానికి భారీగా ఖర్చు తగ్గుతుందని జేపీసీ చైర్మన్, లోక్సభ ఎంపీ పీ.పీ. చౌదరి పేర్కొన్నారు.
గాంధీనగర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా సుమారు రూ.7 లక్షల కోట్ల వరకు ఆదా అవుతుందని తెలిపారు. తరచూ ఎన్నికలు జరగడం వల్ల పాలనలో వచ్చే అంతరాయాలు తగ్గి పరిపాలనా సామర్థ్యం మెరుగుపడుతుందని చెప్పారు. అంతేకాకుండా దేశ జీడీపీ వృద్ధి రేటు 1.6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని కూడా జేపీసీ అంచనా వేసినట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!