
జనరల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం పోలీస్ జిల్లాలను పోలీస్ కమిషనరేట్లుగా అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు పూర్తిస్థాయి ప్రతిపాదనలు, అవసరమైన నివేదికలను సిద్ధం చేసి పంపాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాల్లో శాంతి భద్రతలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, పోలీసింగ్‌ను ఆధునికీకరించడం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆమోదం అనంతరం ఈ మూడు ప్రాంతాలు అధికారికంగా పోలీస్ కమిషనరేట్లుగా మారనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!