

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సెప్టెంబర్ 2న జనసేన యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించనున్నట్లు పార్టీ సమాచారం. ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో యువజన విభాగం లక్ష్యాలు, యువతను రాజకీయంగా భాగస్వామ్యం చేయడం వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై యువజన విభాగం లోగో, గీతాన్ని ఆవిష్కరించనున్నారు.
పవన్ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 2న జనసేన యువజన విభాగాలను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది. యువతను పార్టీలోకి మరింతగా తీసుకురావడం, వారి సమస్యలు, రాజకీయ ఆకాంక్షలకు వేదిక కల్పించడం, పార్టీని స్థానిక స్థాయిలో బలోపేతం చేయడం యువజన విభాగం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విభాగాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!