

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 88వ ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో నిర్వహించారు. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, రెజ్లర్ సంగ్రామ్ సింగ్, నటి మధురిమా తులి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 25,000కుపైగా ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఢిల్లీ వేదికగా 5,000 మందికి పైగా పాల్గొన్నారు. భారత్ సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో ఈ ఎడిషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని మాండవీయ తెలిపారు.
సైక్లింగ్ వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించవచ్చని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి అయినా సైక్లింగ్‌ను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. గౌతమ్ గంభీర్ సైక్లింగ్ రైడ్‌ను జెండా ఊపి ప్రారంభిస్తూ.. ఫిట్‌గా ఉన్న దేశమే మరింత బలమైన, స్వావలంబన కలిగిన దేశంగా ఎదుగుతుందని అన్నారు. బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీబీపీ బ్యాండ్ ప్రదర్శనతో స్టేడియంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!