
సినిమాలు

ఇవాంకా ట్రంప్‌పై హత్య కుట్ర జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె అయిన ఇవాంకాను లక్ష్యంగా చేసుకుని, ఇరాన్‌కు సంబంధించిన ఉగ్ర నెట్‌వర్క్‌తో సంబంధాలున్న ఓ వ్యక్తి ఈ పథకం రచించినట్లు ఆరోపణలు వచ్చాయి. 2020లో ఇరాన్ కమాండర్ ఖాసీం సులేమాని హత్యకు ప్రతీకారంగా ఈ కుట్ర జరిగినట్లు సమాచారం. అయితే, పథకం అమలు కాకముందే నిఘా సంస్థలు స్పందించి అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడైంది.
నిందితుడి వద్ద ఇవాంకా నివాసానికి సంబంధించిన బ్లూప్రింట్లు, ఫోటోలు లభించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఫ్లోరిడాలోని ఆమె ఇంటి వివరాలను కూడా అతడు సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటన అమెరికా భద్రతా వ్యవస్థలో కలకలం రేపుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!