
సినిమాలు

ఒలింపిక్ పటిమ కలిగిన రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు అంతర్జాతీయ పరీక్ష సంస్థ నోటీసులు జారీ చేసింది. పోటీలు లేని సమయంలో నిర్వహించే నిషేధిత పదార్థాల పరీక్షకు ఆమె అందుబాటులో లేకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు. గతేడాది డిసెంబరు 18న జరగాల్సిన పరీక్షకు ఆమె హాజరుకాలేదని పేర్కొన్నారు.
గత పన్నెండు నెలల్లో తన ఉనికి వివరాలను తెలియజేయాల్సిన నిబంధనను ఆమె మొదటిసారిగా ఉల్లంఘించినట్లు తెలిపారు. జనవరి 19న ఆమె ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత ఈ గైర్హాజరీని నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ నోటీసు కేవలం అప్రమత్తం చేయడానికే గానీ నిషేధిత పదార్థాల వినియోగానికి సంబంధించిన ఉల్లంఘన కాదని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!