

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి తీవ్రమయ్యాయి. దక్షిణ, తూర్పు లెబనాన్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం భీకర వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు సమాచారం. హిజ్బుల్లా సాయుధ స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ, మృతుల్లో ఎక్కువ మంది సాధారణ పౌరులేనని లెబనాన్ అధికారులు వెల్లడించారు. ఈ దాడులతో బేరూత్‌తో పాటు సరిహద్దు గ్రామాలు బాంబుల శబ్దాలతో వణికిపోయాయి.
ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. హిజ్బుల్లా బలగాలను పూర్తిగా నిర్మూలించేందుకు లెబనాన్ సరిహద్దుల్లో త్వరలోనే భారీ స్థాయిలో భూతల దాడులు ప్రారంభిస్తామని హెచ్చరించారు. దేశ పౌరుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో 3,200 మందికి పైగా మరణించినట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!