
రాజకీయాలు

ఇరాన్ ప్రభుత్వం మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 28న వైమానిక దాడుల్లో ఆయన మరణించగా, యుద్ధ పరిస్థితుల కారణంగా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.
తాజా షెడ్యూల్ ప్రకారం జూలై 4 నుంచి టెహ్రాన్‌లో మూడు రోజుల పాటు ప్రజల సందర్శనకు అవకాశం కల్పించనున్నారు. జూలై 7న ఖోమ్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూలై 9న ఆయన స్వస్థలమైన మష్హద్‌లోని ఇమామ్ రెజా దర్గా సమీపంలో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!