27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు

Writer: Pooja 05:45 AM, 27 ఆగస్టు, 2026
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవాలు నేటి నుంచి శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. ఆలయంలో నిత్య కైంకర్యాలు, అర్చనలు, పూజల సమయంలో తెలిసీ తెలియక జరిగే దోషాలు, స్పర్శ దోషాలు, లోపాలు, అశుచులు తొలగిపోయి ఆలయ పవిత్రత పరిపూర్ణంగా నిలవాలనే ఉద్దేశంతో ఏటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

రంగురంగుల పట్టు దారాలతో రూపొందించిన పవిత్ర మాలలను ప్రధాన దేవతలు, పరివార దేవతలకు సమర్పించి, వివిధ హోమాలు, జపాలు, మూలమంత్ర హవనాలు నిర్వహించనున్నారు. నేటి తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సుప్రభాత సేవ, అనంతరం స్నపనాభిషేకం, పవిత్ర మాలాధారణ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ క్రతువులు పూర్తయ్యే వరకు దర్శనాలు నిలిపివేసి, ఉదయం 8 గంటల తర్వాత భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు.

మూడు రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ మధ్యాహ్నం పూజా కార్యక్రమాల సమయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మూలమంత్ర హవనాలు, వేద పారాయణాలు, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహిస్తారు. ఈ మూడు రోజులు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. భక్తులు దర్శన సమయాలు, ఆన్‌లైన్ టికెట్లకు సంబంధించిన వివరాలను దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఉత్సవాల అనంతరం అమ్మవారికి సమర్పించిన పవిత్ర మాలలను భక్తులకు ప్రసాదంగా అందించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

తప్పుడు సమాచార వీడియోలపై యూపీ సర్కార్‌ సీరియస్

తప్పుడు సమాచార వీడియోలపై యూపీ సర్కార్‌ సీరియస్

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్

నేపాల్‌ విపత్తుపై మోదీ, ముర్ము సానుభూతి

నేపాల్‌ విపత్తుపై మోదీ, ముర్ము సానుభూతి

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం

ట్యాగ్లు
ఇంద్రకీలాద్రి ఆలయంపవిత్రోత్సవాలుకనకదుర్గ అమ్మవారువిజయవాడ ఆలయంహిందూ పండుగలుఆధ్యాత్మిక కార్యక్రమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

రాహుల్‌పై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్‌పై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు

తప్పుడు సమాచార వీడియోలపై యూపీ సర్కార్‌ సీరియస్
జనరల్

తప్పుడు సమాచార వీడియోలపై యూపీ సర్కార్‌ సీరియస్

ఏఐతో లక్షల ఉద్యోగాలు మాయం కావచ్చు - బిల్‌గేట్స్
బిజినెస్

ఏఐతో లక్షల ఉద్యోగాలు మాయం కావచ్చు - బిల్‌గేట్స్

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్
జనరల్

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్

బంగారం ధరలు స్థిరం...నేటి తాజా రేట్లు ఇవే
బిజినెస్

బంగారం ధరలు స్థిరం...నేటి తాజా రేట్లు ఇవే

నేపాల్‌ విపత్తుపై మోదీ, ముర్ము సానుభూతి
జనరల్

నేపాల్‌ విపత్తుపై మోదీ, ముర్ము సానుభూతి

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం
జనరల్

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం

శ్రీశైలానికి వరద బంద్‌...గోదావరికి భారీ వరద
జనరల్

శ్రీశైలానికి వరద బంద్‌...గోదావరికి భారీ వరద

ఆసియా జూనియర్‌ చెస్‌లో భారత్‌ సత్తా
క్రీడలు

ఆసియా జూనియర్‌ చెస్‌లో భారత్‌ సత్తా

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు ప్రారంభం
జనరల్

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!