
క్రీడలు

యూకేను వదిలి వెళ్లిపోతున్న విదేశీయుల్లో ఎక్కువ మంది భారతీయులేనని తాజా గణాంకాలు వెల్లడించాయి. బ్రిటన్ జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం చదువుల కోసం వెళ్లిన 51 వేల మంది, ఉపాధి కోసం వెళ్లిన 21 వేల మంది, ఇతర కారణాలతో వెళ్లిన 3 వేల మంది భారతీయులు గత ఏడాది యూకేను విడిచిపెట్టారు.
చైనా 46 వేల నిష్క్రమణలతో రెండో స్థానంలో నిలిచింది. ఉక్రెయిన్, పాకిస్థాన్, నైజీరియా దేశాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో యూకే నుంచి బయటకు వెళ్ళినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక దేశంలోకి వచ్చే వలసదారులు, బయటకు వెళ్లే వలసదారుల మధ్య తేడాను నెట్ మైగ్రేషన్గా పిలుస్తారు. గత కన్జర్వేటివ్ ప్రభుత్వంలో ఇది 9.44 లక్షలుగా ఉండగా, ప్రస్తుత లేబర్ ప్రభుత్వంలో 1.71 లక్షలకు తగ్గింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!