

కర్వా చౌత్ సందర్భంగా నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ‘రామాయణం’ చిత్ర బృందం ‘జత గూడే (జుడీ జోడీ)’ పేరుతో కొత్త పాటను విడుదల చేసింది. శ్రీరాముడు, సీతాదేవి మధ్య ఉన్న అందమైన అనుబంధాన్ని ఈ పాట ఆవిష్కరిస్తుంది. వారి వివాహ వేడుకల నేపథ్యంలో రూపొందించిన ఈ గీతం ప్రేమ, విశ్వాసం, కలిసుండటంలోని మాధుర్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఏఆర్ రెహమాన్ ఈ పాటకు స్వరాలు సమకూర్చగా, తెలుగు సాహిత్యాన్ని రాకేందు మౌళి అందించారు. సిరీషా భగవతుల తన మధురమైన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. పాటలోని తెలుగు సంభాషణలకు లిప్‌సింక్ చేయడానికి బ్రహ్మ AI సాంకేతికతను ఉపయోగించిన తీరు కూడా ఆకట్టుకుంటోంది.
‘రామాయణం’ చిత్రం నవంబర్ 5, 2026న ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఓవర్సీస్ పంపిణీ బాధ్యతలను సోనీ పిక్చర్స్ నిర్వహిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తాజాగా విడుదలైన ‘జత గోడే’ పాటతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!