
క్రీడలు

ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగించారు. క్రికెట్ అభిమానుల సౌకర్యార్థం మెట్రో సేవలు అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగనున్నాయి.
మ్యాచ్ తర్వాత ప్రేక్షకులు సులభంగా ప్రయాణించేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భారీగా వచ్చే అభిమానుల రద్దీని నియంత్రించేందుకు మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!