

హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలంగాణ విలీన పోరాట చరిత్రను ప్రస్తావించారు. హైదరాబాద్‌కు, జోధ్‌పూర్‌కు విడదీయరాని అనుబంధం ఉందని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు భారత్‌లో విలీనం కావాలని కోరుకున్నారని, నిజాం పాలనకు వ్యతిరేకంగా అనేక మంది యోధులు పోరాటం చేశారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటంలో ప్రజలు కీలక పాత్ర పోషించారని, తెలంగాణను భారతదేశంలో విలీనం చేయాలనే లక్ష్యంతో ఎంతోమంది పోరాడారని పేర్కొన్నారు.
జోధ్‌పూర్ ప్రతినిధిగా తాను హైదరాబాద్‌కు వచ్చానని షెకావత్ తెలిపారు. తెలంగాణ ప్రజల పోరాటానికి జోధ్‌పూర్ సైన్యం కూడా మద్దతుగా నిలిచిందని, ఈ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు ఆ సైన్యం పనిచేసిందని పేర్కొన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే పోరాట స్ఫూర్తిని నేర్పిస్తూ పెంచే సంప్రదాయం ఇక్కడ ఉందన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని, వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని షెకావత్ అన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!