
సినిమాలు

కౌలాలంపూర్ నుంచి సిడ్నీకి వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానంలో విషాదం చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా 58 ఏళ్ల భారతీయ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురై, ఆస్తమా అటాక్‌తో మృతి చెందారు. పరిస్థితిని గమనించిన విమాన సిబ్బంది అత్యవసర చికిత్స అందించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
విమానం సిడ్నీ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం సిబ్బంది ఘటనను సంబంధిత అధికారులకు తెలియజేశారు. మృతుడి పేరు, ఇతర వ్యక్తిగత వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే ఆయన భారతీయుడని అధికారులు తెలిపారు. ఈ మరణంలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించలేదని పేర్కొన్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది. మలేషియా ఎయిర్‌లైన్స్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!