
జనరల్

అస్సాం శాసనసభలో హిందీని నాలుగో అధికార భాషగా ప్రవేశపెట్టారు. ఇప్పటికే అస్సామీ, ఇంగ్లీష్, బోడో అధికార భాషలుగా ఉండగా, బడ్జెట్ సమావేశాలకు ముందు స్పీకర్ రంజీత్ కుమార్ దాస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో తొలిసారిగా సభ్యులు అసెంబ్లీ అధికారిక కార్యకలాపాల్లో హిందీని ఉపయోగించే అవకాశం పొందనున్నారు.
ఈరోజు నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. బోడో భాష హోదాపై వస్తున్న ఊహాగానాల మధ్య ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ, బోడో భాషను తొలగించే లేదా దాని ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. బోడో భాష పరిరక్షణ, అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!