
జనరల్

‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చిన వ్యవహారంలో తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయెల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ నెల 2న హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పది రోజులపాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం కోర్టు ఆదేశాలకు విరుద్ధమని పేర్కొంటూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.
బుధవారం జరిగిన విచారణలో హోంశాఖ జారీ చేసిన మెమో నిబంధనలకు అనుగుణంగా లేదని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. టికెట్ ధరల పెంపు అంశంలో జీవో 121ను అనుసరించాలని సూచించింది. హోంశాఖ నుంచి పూర్తి వివరాలు సేకరించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!