
సినిమాలు

మంగళవారం హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. మల్కాజిగిరి వినాయక్‌నగర్‌లో అత్యధికంగా 13 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో నగరం మొత్తం వణికిపోయింది. పాతబస్తీలో విద్యుత్ తీగ తెగిపడి ఇద్దరు మృతి చెందారు.
గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో రహదారులు జలమయమై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కూకట్‌పల్లి, మణికొండ, మలక్‌పేట్ వంటి లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. చెట్లు నేలకొరిగాయి, మెట్రో, రోడ్డు రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!