
జనరల్

తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా కుండపోత వర్షం పడటంతో భక్తుల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దర్శనానికి వెళ్లినవారు, దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన భక్తులు వర్షానికి తడిసిపోయి షెడ్ల కింద తలదాచుకున్నారు.
భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి. దుకాణాల్లో సామాగ్రి తడిచిపోవడంతో వ్యాపారులకు నష్టం వాటిల్లింది. అలిపిరి నడక మార్గంలో మెట్లపైకి వర్షపు నీరు రావడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇక తిరుపతి–తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని మలుపుల వద్ద బండరాళ్లు, మట్టి పెళ్ళలు జారిపడ్డాయి. టిటిడి ఇంజినీరింగ్ సిబ్బంది వెంటనే వాటిని తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టిటిడి సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!