
సినిమాలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ డిసెంబరులో తన దేశానికి తిరిగి వెళ్తానని ప్రకటించారు. అరెస్టు, ఉరిశిక్ష ముప్పు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం, న్యాయాన్ని పునరుద్ధరించేందుకు తాను వెళ్తున్నానని ఆమె తెలిపారు. భారత్‌లో నుంచే వర్చువల్‌గా విలేకరుల సమావేశం నిర్వహించిన హసీనా, అధికారం కోసం కాదు ప్రజల కోసం తిరిగి వస్తున్నానని స్పష్టం చేశారు. 2024 విద్యార్థి ఉద్యమాలు వ్యవస్థీకృతంగా హింసాత్మకంగా మారాయని ఆమె ఆరోపించారు.
భారత్ బంగ్లాదేశ్‌కు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిందని హసీనా ప్రశంసించారు. బంగ్లా ప్రజలకు అంతర్జాతీయ మద్దతు అవసరమని కోరారు. అయితే ఢిల్లీలో హసీనా ప్రెస్‌మీట్ నిర్వహించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ పరిణామం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!