
ఓటీటీ

సింగరేణి సంస్థలో అవినీతి, అక్రమాల కారణంగా సంస్థ దెబ్బతింటోందని భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సులో మాట్లాడుతూ, ఈ వ్యవహారంపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణ జరిగితే తమ వద్ద ఉన్న ఆధారాలను అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్న విషయాన్ని గుర్తు చేసిన హరీశ్‌రావు, బాధ్యత నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. గత ప్రభుత్వ హయాంలో 19,500 మందికి ఆధారిత ఉద్యోగాలు కల్పించామని, ప్రస్తుతం నియామకాల ప్రక్రియ మందగించిందని ఆరోపించారు. అలాగే తెలంగాణ జల హక్కులకు సంబంధించిన అంశాల్లో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, ఈ విషయంలో కేంద్రం వైఖరిపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!