
సినిమాలు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరాన్ని శాకాహార నగరంగా అభివృద్ధి చేయడానికి నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది. నగర పరిధిలో ఉన్న మాంసం, చేపలు, కోళ్ల దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నగరంలో ఉన్న 350 నుంచి 400 వరకు మాంసం దుకాణాలను రాబోయే ఆరు నెలల్లో, దీపావళి నాటికి విడతల వారీగా తరలించనున్నారు.
ఈ దుకాణాలను రామ్‌నగర్, సుజాబాద్, గణేశ్‌పూర్, అవలేష్ నగర్, శివపూర్ ప్రాంతాలకు మార్చనున్నారు. ఈ నిర్ణయంతో వారణాసి దేశంలోని రెండో శాకాహార నగరంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం గుజరాత్‌లోని పాలితానా పట్టణం మాత్రమే పూర్తిస్థాయి శాకాహార నగరంగా గుర్తింపు పొందింది. వారణాసిలో హిందువులు 72 శాతం, ముస్లింలు 27 శాతం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!