
జనరల్

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతి భవనాల (సీజీజీపీవోఏ) నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధిలో కీలక ముందడుగుగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆధునిక, పర్యావరణ హిత పరిపాలనా మౌలిక సదుపాయాల కల్పనకు ఇది దోహదపడుతుందని తెలిపారు. అలాగే కేంద్ర కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పాలన మరింత సులభతరం అవుతుందని, అమరావతి భవిష్యత్ అభివృద్ధికి ఇది బలాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!