
జనరల్

Telangana ప్రభుత్వం కార్మికులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. నైపుణ్యాల ఆధారంగా కార్మికులను నాలుగు విభాగాలుగా విభజించి కొత్త వేతనాలను అమలు చేయనుంది.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అన్‌స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం రూ.12 వేల నుంచి రూ.16 వేల వరకు పెంచారు. సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనాలు పెరిగాయి. స్కిల్డ్ కార్మికుల వేతనాలను రూ.17 వేల నుంచి రూ.18 వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!