

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ఆంక్షలు విధించడంపై వివాదం కొనసాగుతోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు నిరసన చేపట్టారు. ట్యాంక్‌బండ్ సంప్రదాయ నిమజ్జన ప్రాంతమని సమితి పేర్కొంటోంది. మరోవైపు కోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
నిరసనలో భాగంగా ట్యాంక్‌బండ్ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను ఉత్సవ సమితి ప్రతినిధులు తొలగించినట్లు సమాచారం. దీంతో పోలీసులు, సమితి ప్రతినిధుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురు పోలీసులు కిందపడినట్లు సమాచారం. అనంతరం ఉత్సవ సమితి ప్రతినిధులు ట్యాంక్‌బండ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల సూచనలు పాటించాలని పోలీసులు కోరుతుండగా.. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలన్న డిమాండ్‌పై ఉత్సవ సమితి పట్టుబడుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!