
జనరల్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో పాకిస్తాన్లో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌పై ఈ పరిస్థితి మరింత తీవ్ర ప్రభావం చూపుతోంది.
మే మొదటి వారంలో లీటర్ పెట్రోల్ ధరను రూ.14.92 పెంచిన పాకిస్తాన్ ప్రభుత్వం, తాజాగా లీటరుకు రూ.5 తగ్గించినప్పటికీ ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.409.78 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.409.58గా ఉంది. పెరిగిన ఇంధన ధరలతో రవాణా ఖర్చులు, నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో రావల్పిండి వంటి నగరాల్లో ఈ-బైక్‌లకు డిమాండ్ పెరుగుతున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!