2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లక్ష మంది విద్యార్థులకు ఉచిత ఏఐ శిక్షణ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

Writer: Shivani K 03:32 PM, 2 నవంబర్, 2026
లక్ష మంది విద్యార్థులకు ఉచిత ఏఐ శిక్షణ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

తెలంగాణలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ అందించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ‘తెలంగాణ ఏఐ అండ్ క్లౌడ్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్’లో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) సహకారంతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రభుత్వానికి, కళాశాలలకు, విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఈ శిక్షణ అందించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో టాస్క్, ఏడబ్ల్యూఎస్ మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని 643 టాస్క్ అనుబంధ కళాశాలల్లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ వంటి పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులతో పాటు ఆర్ట్స్, కామర్స్ వంటి నాన్‌-స్టెమ్ కోర్సుల విద్యార్థులకు కూడా ప్రత్యేక శిక్షణ మార్గాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రాక్టికల్ అనుభవం కోసం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కన్సోల్ సదుపాయాన్ని కల్పించడంతో పాటు, ప్రతి విద్యార్థికి ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ ద్వారా 900కు పైగా డిజిటల్ కోర్సులను ఏడాది పాటు ఉచితంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. అంతర్జాతీయ ధ్రువీకరణ పరీక్షలకు రాయితీ వోచర్లు, పరిశ్రమల నిపుణులతో సమావేశాలు, హ్యాకథాన్‌లు నిర్వహించనున్నారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అర్హులైన విద్యార్థులకు టాస్క్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కళాశాల అధ్యాపకులకు కూడా ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలపై ప్రపంచస్థాయి శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి

సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్ సమస్యను వెంటనే పరిష్కరించాలి.. సామా రామ్మోహన్ రెడ్డి డిమాండ్

సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్ సమస్యను వెంటనే పరిష్కరించాలి.. సామా రామ్మోహన్ రెడ్డి డిమాండ్

అమెరికా షరతులు అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుస్తాం: ఇరాన్

అమెరికా షరతులు అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుస్తాం: ఇరాన్

ఐదు దేశాల్లో డిజిటల్ బిల్‌బోర్డులు హ్యాక్‌..తెరపై అశ్లీల వీడియోలు

ఐదు దేశాల్లో డిజిటల్ బిల్‌బోర్డులు హ్యాక్‌..తెరపై అశ్లీల వీడియోలు

రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన

రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంశ్రీధర్ బాబుఉచిత ఏఐ శిక్షణక్లౌడ్ కంప్యూటింగ్అమెజాన్ వెబ్ సర్వీసెస్టాస్క్విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిజనరేటివ్ ఏఐమెషిన్ లెర్నింగ్ఉద్యోగ అవకాశాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాధ్యాయం.. ప్రపంచకప్ విజయానికి ఏడాది
క్రీడలు

భారత మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాధ్యాయం.. ప్రపంచకప్ విజయానికి ఏడాది

రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్
సినిమాలు

రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్

ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు
రాజకీయాలు

ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు

ఏపీ అభివృద్ధే లక్ష్యం.. కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
రాజకీయాలు

ఏపీ అభివృద్ధే లక్ష్యం.. కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన

మురాసు తుఫాను బీభత్సం.. ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ
జనరల్

మురాసు తుఫాను బీభత్సం.. ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ

రాప్తాడు బాధితుడిని పరామర్శించిన వైఎస్ జగన్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రాప్తాడు బాధితుడిని పరామర్శించిన వైఎస్ జగన్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఇండియా కూటమి ర్యాలీతో ఢిల్లీ వ్యాపారులకు భారీ నష్టం.. సీటీఐ ఆరోపణలు
రాజకీయాలు

ఇండియా కూటమి ర్యాలీతో ఢిల్లీ వ్యాపారులకు భారీ నష్టం.. సీటీఐ ఆరోపణలు

మంత్రి కారుకు డ్రైవర్‌గా మారిన జిల్లా కలెక్టర్.. ధార్వాడలో ఆసక్తికర ఘటన
రాజకీయాలు

మంత్రి కారుకు డ్రైవర్‌గా మారిన జిల్లా కలెక్టర్.. ధార్వాడలో ఆసక్తికర ఘటన

లక్ష మంది విద్యార్థులకు ఉచిత ఏఐ శిక్షణ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
జనరల్

లక్ష మంది విద్యార్థులకు ఉచిత ఏఐ శిక్షణ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

చంద్రబాబు ప్రభుత్వంపై విడుదల రజిని ఫైర్
రాజకీయాలు

చంద్రబాబు ప్రభుత్వంపై విడుదల రజిని ఫైర్

నేహా ఫాతిమా ప్రేమ వ్యవహారం.. బిగ్‌బాస్‌లో కలకలం
షోస్

నేహా ఫాతిమా ప్రేమ వ్యవహారం.. బిగ్‌బాస్‌లో కలకలం

యాపిల్ వాచ్‌కే సవాల్ విసిరిన దీపిందర్ గోయల్
టెక్నాలజీ

యాపిల్ వాచ్‌కే సవాల్ విసిరిన దీపిందర్ గోయల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!