

భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్‌ను ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డులో పార్ట్‌టైమ్, నాన్-అఫీషియల్ డైరెక్టర్‌గా నియమించింది. 2026 ఆగస్టు 20 నుంచి నాలుగేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను కూడా మరో నాలుగేళ్ల కాలానికి నాన్-అఫీషియల్ డైరెక్టర్‌గా పునర్నియమించారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డులో భాగస్వాములను చేయడం ద్వారా నిర్ణయాలకు విస్తృత దృక్పథం లభించే అవకాశం ఉంటుంది.
అంతరిక్ష, సాంకేతిక రంగాల్లో సోమనాథ్‌కు ఉన్న అనుభవం, పారిశ్రామిక రంగంలో ఆనంద్ మహీంద్రా సుదీర్ఘ అనుభవం ఆర్‌బీఐ బోర్డు నిర్ణయాలకు ఉపయోగపడే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ నియంత్రణ, డిజిటల్ కరెన్సీ విస్తరణ, సైబర్ భద్రత వంటి సవాళ్లను బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సమయంలో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!