

2022లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘బ్రహ్మాస్త్ర’ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, అక్కినేని నాగార్జున నటించిన ఈ మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌లో షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమా జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘బ్రహ్మాస్త్ర 2’ పనులు వేగం పుంజుకుంటున్నట్లు సమాచారం. రణబీర్ కపూర్ హీరోగా రూపొందనున్న ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రణబీర్ ద్విపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.
నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణం పార్ట్ 2’ షూటింగ్‌ను రణబీర్ కపూర్ 2027 జనవరి నాటికి పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం. అనంతరం 2027 ఏప్రిల్‌లో ‘బ్రహ్మాస్త్ర 2’ షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివతో పాటు దేవ్ పాత్రలోనూ రణబీర్ కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. ఆలియా భట్ ఇషా పాత్రను కొనసాగించనున్నట్లు సమాచారం. అమృత పాత్ర కోసం దీపికా పడుకొణేతో అయాన్ ముఖర్జీ చర్చలు జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రాలేదు. ‘ధూమ్ 4’ వంటి ప్రాజెక్టులపై వార్తలు ఉన్నా, ప్రస్తుతం రణబీర్ దృష్టి ‘బ్రహ్మాస్త్ర 2’పైనే ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!